బలమైన గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
- December 07, 2015
దోహా మరియు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దాంతో ప్రజలు స్వెట్టర్లను ఆశ్రయిస్తున్నారు. చలిగాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ వర్గాలు వెల్లడించాయి. బలమైన గాలులతో విజిబులిటీ తక్కువగా ఉంటుందనీ, దుమ్ము ధూళి ప్రబావం ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రతలు11 డిగ్రీ సెల్సియస్కి తగ్గవచ్చని అంచనా వేశారు. గరిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీ సెల్సియస్కి దాటకపోవచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లో 15 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. సముద్ర తీర ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చనీ, ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ, బలమైన గాలులతో ఇసుక ఎగిరిపడ్తుందని సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







