'ఆఫీసర్' ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల
- May 22, 2018సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ఆఫీసర్. 28 ఏళ్ళ క్రితం శివ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ- నాగ్ కాంబినేషన్ ఇప్పుడు ఆఫీసర్ చిత్రంతో మరో అద్భుతం క్రియేట్ చేస్తామని అంటున్నారు. యాక్షన్ డ్రామాగా ఆఫీసర్ చిత్రం తెరకెక్కగా,ఈ చిత్రాన్ని మే 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కాని నిర్మాణాంతార కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో జూన్ 1న విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో తాజాగా నవ్వే నువ్వు అనే సాంగ్ వీడియో విడుదల చేశారు. సిరాశ్రీ లిరిక్స్ అందించిన ఈ పాటని రమ్య బెహరా పాడారు. నాగ్ కి, పాపకి మధ్య సాగే ఈ సాంగ్ సంగీత ప్రియులని అలరిస్తుంది. రవి శంకర్ చిత్రానికి సంగీతం అందించారు. కిడ్నాప్ అయిన పాపని రక్షించే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్టు అర్ధమైంది.. మైరా సరీన్ అనే కొత్త అమ్మాయి ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.
కంపెనీ బేనర్ పై వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన శివ, గోవిందా గోవిందా, అంతం చిత్రాలు భారీ విజయం సాధించడంతో ఆఫీసర్ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్