'విజేత' ఎవరో చూడండి!!
- May 23, 2018
టాలీవుడ్ లో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్నారంటే..అభిమానులకు ఎంతో అంచనాలు ఉంటాయి. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ ఏ విషయంలో అయినా సరే తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి..అలా అయితేనే కాంపిటీషన్ లో రాణించగలుగుతారు. ఇప్పటి వరకు వచ్చిన హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి కుర్ర హీరోలు తమ టాలెంట్ తోనే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇక పవన్ కళ్యాన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయనే నెంబర్ వన్ రేస్ లో దూసుకు వెళ్లారు.
మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు..ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో పాల్గొంటున్నారు. తాజాగా మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ (శ్రీజ భర్త), ప్రముఖ చలన చిత్ర సంస్థ వారాహి ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. చిరంజీవి సినీ కెరీర్‌లో మైల్ స్టోన్ లాంటి సినిమా విజేత. ఆ సినిమా టైటిల్‌నే ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ మూవీకి టైటిల్‌గా ఎంచుకున్నారు చిత్రబృందం.
టైటిల్ లోగోను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది.బుధవారం దీని పోస్టర్ ని రిలీజ్ చేసింది.1985 లో చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి తీసిన చిత్రం ' విజేత '. ఆ టైటిల్నే కళ్యాణ్ చిత్రానికీ ఫిక్స్ చేయడం విశేషం. ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే చిత్రాల ఫేమ్ మాళవికా నాయర్ ఈ సినిమా హీరోయిన్. ఈ చిత్రానికి సంబంధించి సింగిల్ షెడ్యూల్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ' విజేత ' చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.
ఓ చిన్నారి చేతిని పట్టుకున్న హీరో చేతిని ఈ పోస్టర్‌లో చూపించారు. పోస్టర్‌పై రాసి ఉన్న దాన్ని చూస్తే సినిమా లైన్ ఏంటో అర్థమవుతుంది. పక్క వారి మొహంలో సంతోషం నింపడం కూడా మనం సాధించే విజయమే అంటూ పోస్టర్‌పై ఉంది. కళ్యాణ్ దేవ్‌కు జోడిగా మాళవికా నాయర్ నటిస్తోంది. రాకేశ్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫర్ : సెంథిల్‌కుమార్, నిర్మాత : రజనీ కొర్రపాటి, మ్యూజిక్ : హర్షవర్థన్ రామేశ్వర్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







