ఎంత నేర్పుగా సమాధానం ఇచ్చిందో చూడండి అమ్మాడీ!
- May 23, 2018
వాహ్ ..మహానటిలో కీర్తి అదరగొట్టింది..సావిత్రి పూనిందా అన్నట్టుగా నటించింది..ఏం అభినయం ఏం అభినయమే మహానటి సావిత్రినే మరిపించి ఈ తరం మహానటి అనిపించుకుంది..ఈ పరభాష పిల్ల మన సావిత్రి పాత్ర పోషించడమా అంటూ పెదవి విరిచిన అందరిని తన నటనతో ముక్కున వేలేసుకునేలా చేసింది..మహానటిలో కీర్తి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది..కానీ కీర్తి..నెక్స్ట్ ఏంటీ.అవును నెక్స్ట్ ఏంటీ..
సాధారణంగా హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ పాత్రలు పోషించడం కంటే గ్లామర్ డాల్స్ గా కమర్షియల్ సినిమాల్లో నటించడానికే ఆసక్తి చూపుతారు..ఎందుకంటే ఒకసారి లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో మునిగిపోతే ఆ సినిమాలు ఎక్కువగా వస్తాయో లేవో తెలీదు..అవి హిట్ అవుతాయో లేదో అస్సలు తెలీదు.ఈ విషయంలో క్లిక్ అయిన ఈ కాలం హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది అనుష్క మాత్రమే..మొదట్లో గ్లామర్ పాత్రలు మాత్రమే పోషిస్తూ వచ్చింది.తర్వాత అరుంధతి నుండి భాగమతి వరకూ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసింది.మరోవైపు తన పాత్రకు ప్రాధాన్యం ఉండేలా పెద్ద హీరోల పక్కన నటిస్తూ గత పదేళ్లుగా ఇండస్ట్రీలో తనస్థానాన్ని పదిలంగా కాపాడుకుంటుంది..మరిప్పుడు కీర్తి..
అందరి దృష్టి కీర్తి గురించి కీర్తి నెక్స్ట్ ఒప్పుకోబోయే పాత్రల గురించే..అదే ప్రస్తావన కీర్తి దగ్గర తెస్తే ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసా..ఇంత చిన్న వయసులో అంత పెద్ద పాత్రా. ఇక పెద్ద సినిమాల్లో చిలిపి పాత్రలు రావా. ఓ లవ్వు.. ఓ కెవ్వు.. ఓ స్టెప్పు లాంటి కమర్షియల్ క్యారెక్టర్లు దొరక్కపోతే లైఫ్ వెలవెలలాడిపోదూ? బ్రాండ్ దశ దిశలా రీ-సౌండ్ కొట్టినా క్రేజ్ కిల్ అయిపోతే కెరియర్ డల్ అయిపోదూ? అని అడిగితే. "నన్ను మరపించే పాత్రలు రావాలి. మిమ్మల్ని మురిపించే నటన నాది కావాలి" అంటున్నారు కీర్తీ సురేష్.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







