పుట్టిన రోజు వేడుకలను రద్దు..
- December 08, 2015
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈసారి అభిమానులు ఎవరూ కూడా తన జన్మదిన వేడుకలను జరపవద్దని, ఆ మేరకు ఎవరైనా ప్రణాళికలు వేసుకుని ఉంటే వాటిని వెంటనే విరమించుకోవాలని చెప్పారు. తమిళనాడులో భారీ వర్షాలకారణంగా వరదలు పోటెత్తి చెన్నైతోపాటు పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి కూడా. ఇలాంటి పరిస్థితులు ఉండగా ప్రస్తుతం జన్మదిన వేడుకల హడావుడి వద్దని, తన అభిమానులంతా కలిసి వరదలకు గురైనవారికి, ప్రాంతాలకు సహాయం చేయాలని కోరారు. చెన్నై మొత్తం కన్నీరుమున్నీరుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తనకు జన్మదిన వేడుకలకన్నా వారికి సహాయం చేయడమే ముఖ్యమని రజనీకాంత్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత 63 ఏళ్ల వయసున్న రజనీకాంత్ ఈ వచ్చే శనివారం 64వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









