హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- March 12, 2026
రియాద్: హరమైన్ హై-స్పీడ్ రైల్వేను రమదాన్ ప్రారంభం నుండి ఇప్పటివరకు వరకు 700,000 మందికి పైగా సందర్శకులు మరియు యాత్రికులు ఉపయోగించుకున్నారని ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది.
హరామైన్ హై-స్పీడ్ రైల్వే మొత్తం 2,300 ట్రిప్పులు తిరిగిందని TGA వివరించింది. ఈ రైలు నగరాల మధ్య రోడ్డు నెట్‌వర్క్‌లపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా లబ్ధిదారులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని అథారిటీ వెల్లడించింది.
ఇక, హరమైన్ హై-స్పీడ్ రైల్వే ఏడాది పొడవునా యాత్రికులకు సేవలందించే కీలకమైన రవాణా ప్రాజెక్టులలో ఒకటి. ఇది మక్కా మరియు మదీనాలను జెడ్డా, కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ ద్వారా కలుపుతుంది. ప్రపంచంలోని పది వేగవంతమైన రైళ్లలో ఇది ఒకటిగా నిలిచింది. దీని షెడ్యూల్ వేగం గంటకు 300 కి.మీ. అని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







