సౌదీలో ప్రమాదం: ఒకరి మృతి
- May 30, 2018
మస్కట్: సౌదీ అరేబియాలో జరిగిన ఓ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. రాయల్ ఒమన్ పోలీస్, బాధితుల్ని ఎయిర్ లిఫ్ట్ చేసి, సుల్తానేట్కి తరలించింది. సౌదీ అరేబియాకి ప్రత్యేక విమానాన్ని ఇందు కోసం తీసుకెళ్ళారు. ఈ విమానంలో అవసరమైన వైద్య సదుపాయాలతోపాటు, మెడికల్ పర్సనల్స్ కూడా వున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సహకారంతో ఈ విమానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గాయపడ్డవారిని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో వైద్య అవసరాల నిమిత్తం ఈ తరహా 'ఎయిర్ లిఫ్టింగ్' చర్యలను చేపట్టడం ద్వారా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రజల మన్ననల్ని అందుకుంటున్నాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







