జనవరి 1 నుంచి 2 మిలియన్ వీసాలు
- December 08, 2015
దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) 59 మిలియన్ లావాదేవీల్ని 2015 ప్రారంభం నుంచి నిర్వహించింది. 12 మిలియన్ వీసాలు ఈ కాలంలో జారీ చేసింది. జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, 42 మిలియన్ ప్రయాణీకులు దుబాయ్ బోర్డర్స్ ద్వారా జనవరి 1 నుంచి నవంబర్ వరకూ ప్రయాణించినట్లు చెప్పారు. మేజర్ జనరల్ అల్ మర్రి ఇంకా మాట్లాడుతూ, అథారిటీ ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టిందనీ, పనితీరు సామర్థ్యం పెంపుతోపాటు, మహిళా వర్కర్ల కోసం పని వేళల్ని వీలుగా మార్చడం జరిగిందని చెప్పారు. పని ప్రాంతాల్లో ప్రమాదాల గురించీ, ఇతర ఇబ్బందుల గురించి అవగాహన పెంచడం ద్వారా ఉద్యోగార్థులకు సహాయపడ్డామని డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ ఒబైద్ మొహైర్ బిన్ సురూర్ అన్నారు. యూఎస్ బేస్డ్ రిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేరీ రూత్ మాట్లాడుతూ, మిడిల్ ఈస్ట్‌లో ఈ తరహా కాన్ఫ్రెన్స్ని తొలిసారిగా నిర్వహించినట్లు చెప్పారు. రెండు రోజుల పాటు మిడిల్ ఈస్ట్‌లోని ఇన్స్యూరెన్స్ మార్కెట్‌పై జరిగిన ఎడ్యుకేఏషన్ మరియు నెట్వర్కింగ్ కాన్ఫరెన్స్‌లో హాజరైన ఔత్సాహికులకు రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రేటజీస్ పట్ల అవగాహన కలగజేశామన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







