అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌తో యూఏఈ పీఎం భేటీ

- December 08, 2015 , by Maagulf
అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌తో యూఏఈ పీఎం భేటీ
 
 


దుబాయ్‌ రూలర్‌ మరియు అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌ సమావేశమై భద్రత, పౌరులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌, యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డిప్యూటీ సుప్రీమ్‌ కమాండర్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చలు జరిగాయి. పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. దేశ ప్రయోజనాలు, ప్రజల భద్రత వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ నేతృత్వంలో, ఆయన ఆలోచనల మేరకు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు, ప్రజలు ఉన్నత విలువలతో, ఉన్నతమైన సౌకర్యాలతో భద్రతతో కూడిన జీవనం పొందేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. 

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com