బస్సుపై దాడి కేసులో జనవరి 12న విచారణ
- December 08, 2015
ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన బస్సుపై తీవ్రవాదులు దాడి జరిపి, ఇద్దరు పబ్లిక్ సెక్యూరిటీ పర్సనల్ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని అడ్వొకేట్ జనరల్, టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ చీఫ్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. ఈ కేసులో 24 మందిని నిందితులుగా గుర్తించడం జరిగిందనీ, పలు సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారాయన. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితులపై అభియోగాల్ని రుజువు చేయనుంది. ఓ పొలిటికల్ సొసైటీకి చెందిన మెంబర్, ఇరాన్ నుంచి నిధులు సేకరించి, కొందర్ని రిక్రూట్ చేసుకుని మరీ ఉద్దేశ్యపూర్వకంగా బాంబులతో, మారణాయుధాలతో ఇంటీరియర్ మినిస్ట్రీ బస్సుపై దాడి చేశారని సిఐడి తేల్చింది. విచారణలో భాగంగా జరిగిన తనిఖీల్లో భారీగా మారణాయుధాలు నిందితుల నుంచి లభ్యమయ్యాయి. ఈ కేసు విచారణ జనవరి 12కి వాయిదా పడింది. ఆ రోజు హై క్రిమినల్ కోర్టులో విచారణ జరుగుతుంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







