అబుదాబీ క్రౌన్ ప్రిన్స్‌తో యూఏఈ పీఎం భేటీ
- December 08, 2015
దుబాయ్ రూలర్ మరియు అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ సమావేశమై భద్రత, పౌరులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చలు జరిగాయి. పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. దేశ ప్రయోజనాలు, ప్రజల భద్రత వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలో, ఆయన ఆలోచనల మేరకు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు, ప్రజలు ఉన్నత విలువలతో, ఉన్నతమైన సౌకర్యాలతో భద్రతతో కూడిన జీవనం పొందేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







