యుపి:దుమ్ముతుఫాను దాటికి 15మంది మృతి
- June 02, 2018
లక్నో:ఉత్తరప్రదేశ్లో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ దుమ్ము తుఫాను ధాటికి 15మంది మృతి చెందగా, మరో తొమ్మిది మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువమంది చెట్లుకూలడం, ఇళ్లు కూలిపోవడంతో మృతి చెందినట్లు యుపి అధికార ప్రతినిధి శనివారం వెల్లడించారు. మొర్దాబాద్లో ప్రారంభమైన తుఫానుకు జిల్లా వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందగా, సంబాల్లో మరో ముగ్గురు మృతిచెందినట్లు ఆయన పేర్కొన్నారు. ముజఫర్నగర్, మీరట్, అమరోహాలలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. 24 గంటలలోగా విపత్తు నివారణా చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లను ఆదేశించింది. గతనెలలో సంభవించిన మూడు భారీ దుమ్ముతుఫానుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 130మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







