ఇరాన్‌పై యుద్ధం లేదని తేల్చేసిన ఖతర్‌ ఉపప్రధాని

- June 03, 2018 , by Maagulf
ఇరాన్‌పై యుద్ధం లేదని తేల్చేసిన ఖతర్‌ ఉపప్రధాని

సింగపూర్‌:ఇరాన్‌తో ఎటువంటి శత్రుత్వాన్ని కొనసాగించదని ఖతర్‌ సీనియర్‌ ఉన్నతాధికారి ఆదివారం స్పష్టం చేశారు. సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రత కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి, ఉపప్రధాని ఖలీద్‌ ఎల్‌ అతియాహ్‌ మాట్లాడుతూ ఖతర్‌కు ఇరాన్‌తో చాలా విభేదాలు ఉన్నాయని, కానీ తమ దేశం యుద్ధానికి ఆజ్యం పోయదని తెలిపారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రకటించడం వివేకమా అని ప్రశ్నించారు. ఇరాన్‌పై యుద్ధానికి మూడవ పక్షంగా ఉన్న కొన్ని దేశాలు ప్రేరేపిస్తున్నాయని, ఇది ఎంతో ప్రమాదకరమైనదని ఆయన ఆరోపించారు. ఇరాన్‌ తమకు సన్నిహిత మిత్ర దేశమని, శాంతి చర్చలపై పిలుస్తామని ఆయన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇరాన్‌పై వైమానిక దాడులను ప్రయోగించడానికి వైమానిక స్థావరాలను ఉపయోగిస్తారా అన్న ప్రశ్నకు తమ దేశం యుద్ధాన్ని ప్రేరేపించదని పేర్కొన్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌,ఆప్గనిస్తాన్‌పై యుద్ధం చేయడానికి ఆల్‌ యుడిద్‌ ఎయిర్‌ బేస్‌లో 10వేల అమెరికా దళాలు ఖతర్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com