అన్నకు సవాలు విసిరిన తమ్ముడు..

- June 03, 2018 , by Maagulf
అన్నకు సవాలు విసిరిన తమ్ముడు..

హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ పేరుతో  కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌  వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం  ఫిట్‌‌గా ఉంటే ఇండియాఫిట్‌‌గా ఉంటుంది  అంటూ ఈ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను మొదలు పెట్టారు.అలాగే హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్, విరాట్ కోహ్లీకి రాథోడ్ సవాల్ విసిరారు.  దీంతో వారు ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి తాము ఫిట్‌నెస్ కోసం చేస్తున్న కసరత్తుల వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌  దక్షణాది తారలకు  పాకింది . మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్, రాథోడ్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి, తారక్‌ను సవాలు విసారు.  ఈ సవాలను  స్వీకరించిన తారక్‌ జిమ్‌లో ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను వర్క్‌ఔట్ చేసి ఆ వీడియోను సోదరుడు కల్యాణ్‌ రామ్‌కు ట్యాగ్‌ చేశారు.సోదరుడి చాలేంజ్‌కు  స్పందించిన  కళ్యాణ్  ‘ఛాలెంజ్‌ స్వీకరించా నాన్నా తారక్‌ అంటూ తన  వ్యాయామ  కసరత్తుల వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అలాగే అల్లు అర్జున్‌, రామ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com