తెలంగాణలో స్పోర్ట్స్ స్కాం ప్రకంపనలు..

- June 06, 2018 , by Maagulf
తెలంగాణలో స్పోర్ట్స్ స్కాం ప్రకంపనలు..

ఆటల కోటాతో ఆటలాడుకున్నారు.. మెడికల్‌ సీట్ల కోసం స్పోర్ట్స్‌ పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు.. అర్హత లేకపోయినా ఇష్టారాజ్యంగా సీట్లు కట్టబెట్టిన స్పోర్ట్స్‌ స్కాం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణా స్పోర్ట్స్‌ కోటా మెడికల్‌ సీట్ల కుంభకోణం కేసులో పై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. స్వయంగా ముఖ్యమంత్రే ఈ కేసు పై పూర్తి స్థాయిలో విచారణ చేయాలనీ ఆదేశించడంతో ఏకకాలంలో ఐదు ప్రదేశాల్లో సోదాలు చేసి ఆ డొంకను కదిపారు అధికారులు.

స్పోర్ట్స్‌ కోటా మెడికల్‌ సీట్ల కుంభకోణం కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. 2017-2018 సంవత్సరంలో జరిగిన కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని మెడికల్‌ కాలేజీల్లో 2000 వరకు సీట్లున్నాయి. రిజర్వేషన్లలో భాగంగా స్పోర్ట్స్‌ కోటాకు 0.5 శాతం కింద 10 సీట్లు కేటాయించారు. నిబంధనలు ప్రకారం మెరిట్‌ క్రీడాకారులకు సీట్లు ఇవ్వాలి. కానీ తొమ్మిది మంది సాట్స్‌ అధికారులు వారికి నచ్చిన వాళ్లకే సీట్లు అమ్ముకున్నారని, అనర్హులకు సైతం సీట్లు కేటాయించి, అర్హులకి మొండి చేయి చూపారంటూ గతంలో చాలా ఫిర్యాదులందాయి.

ఇవాన్‌జెలీన్‌ అనే ఓ క్రీడాకారిణికి సంబంధించిన వివరాలను ఆర్చరీ అసోసియేషన్‌ సభ్యులు పరిగణలోకి తీసుకోక పోవడంతో ఆమెకు రావాల్సిన మెడికల్‌ సీటును శాప్ కమిటి సభ్యులు వేరే వాళ్లకు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో ఒక్క సీటు కోసం లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ ఎంబీబీఎస్ సీట్ల కుంబకోణం పై ప్రభుత్వం ద్విసభ్య కమిటీని నియమించింది. 

ఈ కుంభకోణంపై మొదట రెండు కమిటీలు వేసి విచారణ చేసిన ఎలాంటి ఉపయోగం లేకపోయింది. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కేసుపై అధికారులుతో రెండు గంటలు పాటు చర్చించి రెండు కమిటీలు ఇచ్చిన నివేదిక ను పరిశీలించి, పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులకు సూచించారు. 

సీఎం ఆదేశాలతో ఏసీబీ అధికారులు ఐదు ప్రదేశాల్లో సోదాలు చేశారు. రామంతపూర్ లోని స్పోర్ట్స్‌ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ నివాసంతో పాటు ఎల్బీ స్టేడియంలోని అతడి కార్యాలయంలో సోదాలు చేశారు అధికారులు. అలాగే స్పోర్ట్స్‌ కమిటీ సభ్యుల ఇళ్లలోనూ ఏసీబీ దాడులు చేశారు. ఆయా కార్యాలయాల్లో మొత్తం తొమ్మిది టీంలు సోదాలు చేశాయి. ఈ సోదాల్లో బాగంగా కొన్ని ఆస్తులు కి సంబందించిన పత్రాలు , హార్డ్ డిస్క్ లు , కొన్ని స్పోర్ట్స్ కమిటి కి చెందినా ఫైల్స్ ను ఏసీబీ స్వాదీనం చేసుకుంది. వెంకటన రమణను అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించారు..  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com