ఆసియా కప్: ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ మహిళల జట్టు
- June 06, 2018
ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. భారత్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ మహిళల జట్టు అద్భుత ఆట తీరును కనబరిచింది. తొలిసారి భారత మహిళల జట్టుపై బంగ్లాదేశ్ మహిళల జట్టు గెలిపోదింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్(42), దీప్తి శర్మ(32) పరుగులతో రాణించారు.142 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఫర్గానా హోక్ (52 నాటౌట్) బంగ్లాదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించింది.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







