బిగ్ బ్రేకింగ్:ఫేస్‌బుక్ లో 'బగ్'..

- June 07, 2018 , by Maagulf
బిగ్ బ్రేకింగ్:ఫేస్‌బుక్ లో 'బగ్'..

డేటా లీకేజి ఆరోప‌ణ‌లు, కేసులు, విచార‌ణ‌ల‌తో మూడు నెలలుగా ఉక్కిరిబిక్కిర‌వుతున్న ఫేస్‌బుక్. మరో భారీ ఉపద్రవం నుంచి బయటపడుతోంది. ఫేస్‌బుక్‌ యూజర్లకు సంబంధించిన ప్రైవసీ సెట్టింగ్స్ లో 'బగ్' ను గుర్తించినట్టు ఫేస్‌బుక్ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ ఎరిన్‌ ఈగన్‌ చెప్పారు. ఇది మే నెలలో 1.4 కోట్ల మంది యూజర్లును ప్రభావితం చేసిందని వెల్లడించారు. ఈ బగ్ ప్రభావంతో  స్నేహితుతో లేదా ఎవరికివారే షేర్‌ చేసుకున్న  పోస్టులు.. పబ్లిక్‌గా వెళ్లిపోయాయని అన్నారు. ఫేస్‌బుక్ యూజర్లు ప్రైవసీ సెట్టింగ్స్‌ మారుతున్నట్టు గుర్తించినట్లయితే వాటిని వెంటనే రీసెట్ చేసుకోవాలని కోరారు. అలా చేసుకొని పక్షంలో   వారి పోస్టులు పబ్లిక్‌ లోకి వెళ్లే ప్రమాదం ఉందని  ఆయన హెచ్చరించారు.అయితే  బగ్‌ యాక్టివ్‌లో ఉన్న సమయంలో షేర్‌ చేసుకున్న పోస్టులకు మాత్రమే ఇది ప్రభావితమైందని గుర్తుచేశారు. యూజర్లు తమ పోస్టులు ప్రైవసీలో ఉన్నాయో లేదో సమీక్షించుకోవాలని ఎరిన్‌ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com