నిహారిక సినిమా కొత్త పోస్టర్ విడుదల
- June 13, 2018
మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు మెగా హీరోయిన్‌గా అభిమానుల మనసులు దోచుకుంది. ఇటీవల నిహారిక హ్యపీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది. లక్ష్మణ్ కర్య ఈ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్, నిహారిక హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్టు తెలుస్తుంది. పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అని ప్రచారం జరిగింది. కాని చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం సంగీత దర్శకుడి వివరాలతో పాటు థమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించనున్నట్టు ప్రకటించింది. శక్తికాంత్ కార్తీక్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ మరియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర రిలీజ్ డేట్ త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నారు. ఇక నిహారిక ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్ అనే టైటిల్‌తో రూపొందుతున్న తమిళ చిత్రంలోను నటిస్తుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నిహారిక రెండు వైవిధ్యమైన పాత్రలలో కనిపించనున్నట్టు టాక్.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







