యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- January 16, 2026
రియాద్: సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్‌తో కౌన్సిల్ చైర్మన్ రషద్ అల్-అలీమి మరియు సభ్యులు జరిపిన సమావేశం సక్సెస్ అయింది. యెరాష్ట్ర సంస్థల పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడం, రెండు దేశాల మధ్య అన్ని స్థాయిలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించినట్లు కౌన్సిల్ తెలిపింది.
రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో సౌదీ అరేబియాకు, యెమెన్ ప్రజలకు మద్దతు కోసం కౌన్సిల్ కృషి చేసిందని ప్రశంసలను వ్యక్తం చేసింది. యెమెన్ ఐక్యత, భద్రత మరియు స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర పోసిస్తుందని అన్నారు. సంఘర్షణను తగ్గించడం, పౌరులను రక్షించడం మరియు చట్టబద్ధతకు మద్దతు ఇచ్చే సైనిక మరియు భద్రతా నిర్ణయాలను అమలు చేయల్సిన సోటుటటుచేయడంలో దాని నాయకత్వాన్ని కౌన్సిల్ గుర్తించింది. ఇది, వివిధ రంగాలలో యెమెన్ ప్రజలకు సౌదీ మద్దతును హామీ ఇచ్చే కొత్త దశకు పునాది వేస్తుందని కౌన్సిల్ పేర్కొంది.
హద్రమౌత్ మరియు అల్-మహ్రా, తాత్కాలిక రాజధాని ఆడెన్ మరియు మిగిలిన విముక్తి పొందిన గవర్నరేట్లలో సైనిక శిబిరాలను విజయవంతంగా అప్పగించడం మరియు దాని ఫలితంగా రాజకీయ, భద్రత మరియు పరిపాలనాపరమైన చిక్కులను దృష్టిలో ఉంచుకుని దేశంలో ఇటీవలి పరిణామాలను సమావేశంలో చర్చించారని అధికార యంత్రాగం తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







