దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెళ్ళే ప్రయాణీకులకు ఉచిత ఐస్‌ క్రీమ్‌

- June 14, 2018 , by Maagulf
దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెళ్ళే ప్రయాణీకులకు ఉచిత ఐస్‌ క్రీమ్‌

దుబాయ్‌:దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రయాణించే ప్రయాణీకులకు జూన్‌ 15 నుంచి ఉచితంగా ఐస్‌ క్రీమ్‌ని అందించనున్నారు. ఎమిరేట్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం టెర్మినల్‌ 3 డిపాచ్యుర్‌ వద్ద, ట్రాన్సిట్‌ ఏరియాస్‌ వద్ద జూన్‌ 15 నుంచి ఆగస్ట్‌ 31 వరకు ప్రయాణీకులకు ఐస్‌ క్రీమ్‌ కప్స్‌ అందించనున్నారు. ఎమిరేట్స్‌ ఫ్లైట్‌ కేటరింగ్‌ (ఇకెఎఫ్‌సి), ఎంపరర్‌ బ్రాండ్‌పై ఈ ఐస్‌ క్రీమ్‌ని తయారు చేయనున్నారు. ఐదు ఫ్లేవర్స్‌లో ఈ ఐస్‌ క్రీమ్స్‌ అందుబాటులో వుంటాయి. చాకొలేట్‌, వెనీలా, డేట్‌ మరియు అరబిక్‌ కాఫీ, మాంగో సార్బెట్‌, లెమన్‌ సార్బెట్‌ వంటి ఫ్లేవర్లలో ఐస్‌ క్రీమ్స్‌ లభ్యమవుతాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com