యూఏఈలో కొత్త జాబ్, వీసా రూల్స్‌ని ప్రకటించిన షేక్ మొహమ్మద్
- June 14, 2018
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్లో ఫారిన్ వర్కర్స్ ఇన్స్యూరెన్స్ అలాగే వీసా ఫెసిలిటేషన్స్కి సంబంధించిన కీలక నిర్ణయాలు ఇందులో వున్నాయి. ఇప్పటిదాకా వున్న 3,000 దిర్హామ్‌ల మ్యాండేటరీ డిపాజిట్ స్థానంలో 60 దిర్హామ్‌ల డిపాజిట్‌ని ఇన్సూరెన్స్ నిమిత్తం తీసుకొచ్చారు. విజిటర్స్, రెసిడెంట్స్, ఫ్యామిలీస్, పీపుల్‌కి సంబంధించి వీసా ఫెసిలిటేషన్స్ని క్యాబినెట్ అడాప్ట్ చేసింది. ప్రస్తుత రెసిడెన్సీ సిస్టమ్‌ని రివ్యూ చేయాలని కూడా నిర్ణయించారు. ట్రాన్సిట్ వీసాకి సంబంధించి ఎగ్జంప్ట్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఇకపై ట్రాన్సిట్ వీసా 96 గంటల వరకు పొడిగించడానికి వీలుంది. ఇందుకోసం కేవలం 50 దిర్హామ్‌ల ఫీజుని మాత్రమే వసూలు చేస్తారు. ఓవర్ స్టేయింగ్ పీపుల్‌కి సంబంధించి 'నో ఎంట్రీ' పాస్‌పోర్ట్ స్టాంప్ లేకుండా, దేశం విడిచేందుకు అవకాశం కల్పిస్తారు. ఓవర్‌స్టే చేసే జాబ్ సీకర్స్కి 6 నెలల వీసా మంజూరు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కేటగిరీలోనివారు, ఇతరులతో సమానంగా అవకాశాలు పొందేలా వారికి వెసులుబాటు కల్పించేందుకు క్యాబినెట్ ఓ రిజల్యూషన్‌ని అడాప్ట్ చేసింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







