ఖతార్:ఇఫ్తార్ పార్టీ, వైఎస్సార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అవార్డ్స్
- June 14, 2018
ఖతార్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దోహా ఖతార్ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ నేతృత్వంలో వైస్సార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2018 నిర్వహించారు.అలాగే, వైఎస్సార్సీపీ దోహా ఖతార్ కో కన్వీనర్ జాఫర్ హుస్సేన్ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. మే 11 న నుంచి ప్రారంభించారు.15 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీకి సంబంధించి ఫైనల్ మ్యాచ్ ఖతార్ ఫౌండేషన్ గ్రౌండ్స్‌లో జరిగింది. విజేతలకు 5000 ఖతారీ రియాల్స్ నగదుని బహుమతిగా అందజేశారు. ఈ నగదుని చింతలపాటి శ్రీనివాసరాజు అందించారు, రెండో విజేతకి 2500 ఖతారీ రియాల్స్‌ని బిషప్ డాక్టర్ ఓగూరి బుల్లబ్బాయి అందించారు.టోర్నమెంట్ సంబంధిత షీల్డ్స్‌ని సుంకర సాంబశివరావు స్పానర్ చేసారు, డ్రింకింగ్ వాటర్, స్నాక్స్‌ని నల్లి నాగేశ్వర్‌రావు సమకూర్చారు. మ్యాచ్ విజేతలు ఇప్తార్ పార్టీకి హాజరై, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పలువురు తెలుగు వారు పాలుపంచుకున్నారు.ఈ కార్యక్రమానికి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, షేక్ అమ్జాద్ బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)







తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







