దొంగిలించిన క్రెడిట్‌ కార్డ్స్‌తో టిక్కెట్‌ అమ్మకాలు

- December 10, 2015 , by Maagulf
దొంగిలించిన క్రెడిట్‌ కార్డ్స్‌తో టిక్కెట్‌ అమ్మకాలు

ఖతారీ పౌరులకు చెందిన క్రెడిట్‌ కార్డ్స్‌ని దొంగిలించి, వాటితో ఎయిర్‌ టిక్కెట్లను బుక్‌ చేసి అమ్ముకుంటోన్న అరబ్‌ జాతీయుడ్ని క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సిఐడి), ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్‌ (ఇంటర్‌పోల్‌) సహాయంతో అరెస్ట్‌ చేశారు. ఖతార్‌ ఎయిర్‌ వేస్‌ నుంచి అందుకున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగి, వ్యూహాత్మకంగా ఆ నిందితుడ్ని అరెస్టు చేసినట్లు సిఐడి అధికారులు వెల్లడించారు. అరబ్‌ జాతీయులు కొందరు, విదేశాల్లో నివసిస్తూ, తక్కువ ధరకే ఎయిర్‌ టిక్కెట్లు అంటూ ఆఫర్‌ చేస్తున్నారనీ, సోషల్‌ మీడియా ద్వారా ఇదంతా జరుగుతోందని తెలిపారు. టిక్కెట్లను అధీకృతులైన విక్రేత కేంద్రాల ద్వారానే కొనుగోలు చేయాలని సిఐడి అధికారులు పౌరులకు సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com