జిసిసి సమ్మిట్‌లో కీలక చర్చలు
- December 10, 2015
గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ (జిసిసి) యాన్యువల్ సమ్మిట్‌లో కీలక చర్చలు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని పెంపొందించే దిశగా తీసుకోవాల్సిన చర్చలపై ఈ సమ్మిట్‌లో జిసిసి ముఖ్య నాయకులు చర్చలు జరిపారు. ఇంధన ధరల పతనం, ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు నేతలు. అలాగే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కి మద్దతుగా నిలవాలని తీర్మానించారు. గల్ఫ్ మిలిటరీ ఫోర్సెస్ ఎమెన్‌లో ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న తీవ్రవాదులతో పోరాడుతున్న వైనం కూడా చర్చకు వచ్చింది. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గల్ఫ్ దేశాలు ఉపేక్షించరాదని ఈ సమావేశంలో తీర్మానించారు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌది అరేబియా మరియు యూఏఈ ప్రతినిథులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. సౌదీ రాజధానిలో జరుగుతున్న ఈ సమావేశాలు గల్ఫ్ దేశాలను అభివృద్ధి పథంలో, ఏకతాటిపై నడిపిస్తాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







