దొంగిలించిన క్రెడిట్ కార్డ్స్‌తో టిక్కెట్ అమ్మకాలు
- December 10, 2015
ఖతారీ పౌరులకు చెందిన క్రెడిట్ కార్డ్స్‌ని దొంగిలించి, వాటితో ఎయిర్ టిక్కెట్లను బుక్ చేసి అమ్ముకుంటోన్న అరబ్ జాతీయుడ్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి), ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్) సహాయంతో అరెస్ట్ చేశారు. ఖతార్ ఎయిర్ వేస్ నుంచి అందుకున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగి, వ్యూహాత్మకంగా ఆ నిందితుడ్ని అరెస్టు చేసినట్లు సిఐడి అధికారులు వెల్లడించారు. అరబ్ జాతీయులు కొందరు, విదేశాల్లో నివసిస్తూ, తక్కువ ధరకే ఎయిర్ టిక్కెట్లు అంటూ ఆఫర్ చేస్తున్నారనీ, సోషల్ మీడియా ద్వారా ఇదంతా జరుగుతోందని తెలిపారు. టిక్కెట్లను అధీకృతులైన విక్రేత కేంద్రాల ద్వారానే కొనుగోలు చేయాలని సిఐడి అధికారులు పౌరులకు సూచించారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









