మదీనాలో సెక్యూరిటీ ఆఫీసర్స్‌పై దాడి: నలుగురి అరెస్ట్‌

మదీనాలో సెక్యూరిటీ ఆఫీసర్స్‌పై దాడి: నలుగురి అరెస్ట్‌

మదీనా:మదీనాలో ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసిన కేసులో నలుగురు వ్యక్తుల్ని సౌదీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పబ్లిక్‌ సెక్యూరిటీ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, ఇద్దరు పోలీసు అధికారులు ట్రాఫిక్‌ డ్యూటీలో వుండగా, వారిపై కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, ఈ ఘటనను క్రిమినల్‌ యాక్ట్‌గా పేర్కొంది. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతకు ముందు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు పోలీసు అధికారులపై మదీనాలో కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆ వీడియోలో కన్పించింది. సౌదీ ప్రాసిక్యూటర్‌ నిందితుల అరెస్ట్‌కి వారెంట్‌ జారీ చేసింది. 

Back to Top