హీరో నానీ చెప్పిన మరో గుడ్ న్యూస్
- June 15, 2018
నానీ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులు పండగే. హాయిగా సాప్ట్‌గా సాగిపోతుంది. ఎటువంటి హడావిడీ ఉండదు. అయినా ఆకట్టుకుంటుంది. కథలను తాను ఎంపిక చేసుకునే తీరు అతడిని స్టార్‌ని చేసాయి. బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నా మరో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఎంసీఏ వరకు బ్రేకుల్లేని బండిలా దూసుకుపోయినా కృష్ణార్జున యుద్ధం మాత్రం అభిమానులను నిరాశపరిచింది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తూ నాగార్జునతో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ మొదలు పెట్టాడు నానీ. ఇది ఓ పక్క జరుగుతుండగానే మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశాడు. జెర్సీ అనే టైటిల్ దాని పక్కన క్రికెట్ బ్యాట్, హెల్మెట్ , గ్లౌజ్‌ల వంటి క్రికెట్ కిట్ ఉండడంతో ఇది ఆ గేమ్ నేపథ్యంలో సాగే సినిమాగా అనిపిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







