రంజాన్‌ సాక్షిగా కాశ్మీర్‌లో రాళ్లదాడులు.. ఒకరు మృతి

రంజాన్‌ సాక్షిగా కాశ్మీర్‌లో రాళ్లదాడులు.. ఒకరు మృతి

కాశ్మీర్‌: రంజాన్‌ పర్వదినం సందర్భంగా ప్రార్దనలు పూర్తైన తర్వాత కశ్మీర్లో యువత రెచ్చిపోయి రాళ్లతో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడింది. దీంతో భద్రతా బలగాలు అల్లరిమూకలపై టియర్‌గ్యాస్‌ ప్రయోగించాయి. ఈ నేపథ్యంలో అనంతనాగ్‌ జిల్లాలోని బ్రాక్‌ పోరా ప్రాంత వాసి ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ప్రార్దనల తర్వాత 6.45 గంటల సమయంలో ఆందోళనకారులు రెచ్చిపోయి భద్రత కోసం మోహరించిన జవాన్లపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పోలీసులు పెల్లెట్లను ప్రయోగించడంతో ముగ్గురికి గాయాలయ్యాయి ఒకరు మృతి చెందారు.

Back to Top