ఈ నెల 24న చికాగో సెక్స్ రాకెట్ పై 'మా' మీటింగ్
- June 16, 2018
యుఎస్ లో టాలీవుడ్ హీరోయిన్స్ సెక్స్ రాకెట్'తో 'మా' అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. చికాగో సెక్స్ రాకెట్ లో నిర్మాత కిషన్ మోదుగుముడి దంపతులని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్ లో టాలీవుడ్ కు చెందిన టాప్ హీరోయిన్స్ ఉన్నట్టు చెబుతున్నారు. ఆ పేర్లు బయటికొస్తే టాలీవుడ్ షేక్ అవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు లీకయ్యాయని తెలుస్తోంది.
ఈ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ మా అసోసియేషన్ జూన్ 24 సమావేశం కానున్నట్లు ప్రకటించింది. ఈ సమావేశంలో ఏం చర్చించబోతున్నారు. ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారంపై నటి శ్రీరెడ్డి, యాంకర్ అనసూయలు స్పందించారు. గతంలో అమెరికా దంపతులు తమని కూడా సంప్రదించారని తెలిపారు.
కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన కిషన్ మోదుగుముడి అలియాస్ రాజు అలియాస్ శ్రీరాజు, అతని భార్య చంద్రలు టాలీవుడ్‌కు చెందిన నటీమణులను తాత్కాలిక వీసా మీద అమెరికాకు తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు అభియోగాలు నమోదుచేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







