మాస్క్ డొనేషన్ బాక్స్‌ల దొంగతనం: ముగ్గురు బాలుర అరెస్ట్
- June 17, 2018
బహ్రెయిన్:మాస్క్‌లలోని డొనేషన్ బాక్స్‌ల నుంచి డబ్బుని దొంగిలిస్తున్న ముగ్గురు బాయ్స్‌ని అరెస్ట్ చేసినట్లు ముహర్రాక్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ పేర్కొంది. హిద్‌లో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో దొంగతనాలకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. డొనేషన్ బాక్స్‌ల కవర్ తొలిగించి, అందులోంచి డబ్బుని తస్కరించిన ముగ్గురు కుర్రాళ్ళ వ్యవహారం సర్వైలెన్స్ కెమెరాల్లో నమోదయ్యింది. ఆ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు, ముగ్గురు కుర్రాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అత్యంత హేయమైన చర్య అనీ, ఈద్ స్పిరిట్‌ని దెబ్బతీసే ఇలాంటి నేరాల్ని క్షమించరాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఇంకోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ విన్పిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..