శ్మశానాల వద్ద ఉచిత వైఫై ..

- December 10, 2015 , by Maagulf
శ్మశానాల వద్ద ఉచిత వైఫై ..

సమాధుల వద్ద... ఉచిత వైఫై సదుపాయం మాస్కో అధికారుల నిర్ణయం  రష్యా రాజధాని మాస్కోలో అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలో ప్రజలు సమూహాలుగా సంచరించే ప్రదేశాల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నగరంలో ఉన్న మూడు ప్రధాన శ్మశానాల వద్ద కూడా వచ్చే ఏడాది నుంచి ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ శ్మశానాలు చారిత్రక ప్రాధాన్యం కలవని, పలువురు రష్యన్‌ వీరుల సమాధులు అక్కడ ఉన్నాయని, ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడం వల్ల అక్కడికి సందర్శకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. శ్మశానాల వద్ద సందర్శకులు సేదతీరడానికి ఏర్పాటుచేసే ప్రత్యేక ప్రాంతంలో ఈ ఇంటర్నెట్‌ వసతి కల్పిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com