ఎయిర్‌పోర్టు అథారిటీలో ఉద్యోగ అవకాశాలు
- June 18, 2018
చెన్నైలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా - జూనియర్ & సీనియర్ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచేరి, లక్షద్వీప్ దీవులకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాలవారీ ఖాళీలు: జూనియర్ అసిస్టెంట్లు (ఫైర్ సర్వీస్) 147, సీనియర్ అసిస్టెంట్ (ఎలకా్ట్రనిక్స్) 39
అర్హత: జూనియర్ అసిస్టెంట్లకు పదోతరగతితోపాటు 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (మెకానికల్ / ఆటొమొబైల్ / ఫైర్) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇం టర్ పూర్తిచేసి ఉండాలి. వ్యాలిడ్ మీడియం / లైట్ మో టార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. సీనియర్ అసిస్టెంట్లకు డిప్లొమా (ఎలకా్ట్రనిక్స్ / టెలీ కమ్యూనికేషన్ / రేడియో ఇంజనీరింగ్) తోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 2017 మార్చి 31 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
జూనియర్ అసిస్టెంట్ల ఎంపిక ప్రక్రియ: ఇందులో స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటాయి. స్టేజ్ 1లో 2 గంటల రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) జరుగుతుంది. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. అంటే మొత్తం మార్కులు 100. పదోతరగతి స్థాయిలో బేసిక్ అర్థమెటిక్, బేసిక్ సైన్స్, ఎలిమెంటరీ ఇంగ్లీష్ గ్రామర్ ప్రశ్నలు, ఇంటర్ స్థాయిలో జనరల్ నాల్‌డ్జ్ ప్రశ్నలు అడుగుతారు. రాత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులకు స్టేజ్ 2 కింద సర్టిఫికెట్స్ / డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ఎండ్యూరెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో 100 మీ. రన్నింగ్, రోప్ క్లైంబింగ్, పోల్ క్లైంబింగ్, హ్యూమన్ డమ్మీతో 60 మీ రన్నింగ్, ల్యాడర్ క్లైంబింగ్ ఉంటాయి.
సీనియర్ అసిస్టెంట్ల ఎంపిక ప్రక్రియ: ఇందులో కూడా 2 గంటల రాత పరీక్ష ఉంటుంది. సంబంధిత సబ్జెక్టు నుంచి 70 శాతం ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలెక్చ్యువల్, జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ నుంచి 30 శాతం ప్రశ్నలు అడుగుతారు. తదుపరి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు 14 వారాల ట్రైనింగ్ నిర్వహిస్తారు. మొదటి 10 వారాలు సీఏటీసీ, ఆర్‌టీసీ కేంద్రాల్లో కోర్సుకు సంబంధించిన తరగతులు జరుగుతాయి. అనంతరం 4 వారాలపాటు వివిధ స్టేషన్లలో జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
పరీక్ష కేంద్రాలు: చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, విజయవాడ
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 15
వెబ్‌సైట్: www.aai.aero/en/careers/recruitment
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..