సిరియాలో వైమానిక దాడులు, 52 మంది మృతి

- June 18, 2018 , by Maagulf
సిరియాలో వైమానిక దాడులు, 52 మంది మృతి

సిరియాలో మారణ హోమం ఆగడం లేదు. తూర్పు సిరియాలో సోమవారం వైమానిక దాడులు జరిగాయి. ఇందులో 52 మంది బలయ్యారు. వీరంతా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ తరఫున పోరాడుతున్నవారే. మృతి చెందినవారిలో 30 మంది ఇరాక్‌ సైనికులున్నారు. మరో 16 మంది సిరియా జవాన్లు, స్థానిక పౌర సైనికులు ఉన్నారు. మిగతా ఆరుగురి వివరాలు తెలియరాలేదు. ఈ దాడి వెనుక తామే ఉన్నామన్న సిరియా ఆరోపణను అమెరికా సంకీర్ణ సేనలు తోసిపుచ్చాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com