గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు ప్రారంభం...

- June 19, 2018 , by Maagulf
గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు ప్రారంభం...

గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు ప్రారంభమయ్యాయి... రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కార్గో విమాన సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీపా లార్జిస్టిక్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ ఏజన్సీ సుకుమార్ పాల్గొన్నారు. ఇకపై గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ సహా ఇతర మార్గాల్లో 20 విమాన సర్వీసులతో కార్గో సేవలు అందించనుంది. దీంతో గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడినట్టు అయ్యింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు వస్తున్న తరుణంలో కార్గో సర్వీసులకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు సరుకులు రవాణా చేయడానికి వీలుంటుంది. అయితే కార్గో సేవలు విస్తరించడానికి మంచి అవకాశాలున్నాయన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.

కార్గో సేవలు ప్రారంభించిన అనంతరం మీడియాలో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర... విజయవాడ నుంచి కార్గో సేవలు విస్తరించటానికి మంచి అవకాశాలున్నాయని తెలిపారు. దీంతో వ్యవసాయ, మత్య, మాంస ఉత్పత్తులకు మంచి ధరలు దక్కే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దేశీయ మార్గాల్లో కార్గో సేవలు ప్రారంభించడగా... అతి త్వరలో అంతర్జాతీయ కార్గోగా విస్తరిస్తామని తెలిపారు. నూజివీడు మామిడి, మత్య, మాంస ఉత్పత్తులకు కార్గో వల్ల గిట్టుబాటు ధరలు వస్తాయని అంచనా వేస్తున్నామని వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com