సౌదీ జట్టుకు తప్పిన పెను ప్రమాదం.
- June 19, 2018
రష్యా వేదికగా ఫిఫా వరల్డ్ కప్‌లో సౌదీ అరేబియా వరల్డ్ కప్ జట్టు పెను ప్రమాదం నుంచి బయటపడింది. టోర్నీలో భాగంగా సౌదీ అరేబియా జట్టు తమ తదుపరి మ్యాచ్ కోసం రొస్తోవ్ ఆన్ డాన్‌కు ప్రయాణిస్తోన్న సమయంలో విమాన ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
అయితే, పైలెట్ అప్రమత్తతో విమానంలో ప్రయాణిస్తోన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని సౌదీ పుట్‌బాల్ ఫెడరేషన్ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. సౌదీ పుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అహ్మద్ అల్ హర్బీ సౌదీ స్పోర్ట్స్ టీవీ ఛానల్ కెఎస్ఏతో మాట్లాడుతూ "ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. కుడివైపున ఉన్న ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించినప్పటికీ, విమానం క్షేమంగానే ల్యాండ్ అయింది" అని అన్నాడు.సౌదీ అరేబియా పుట్‌బాలర్లు సైతం విమాన ఫైలట్ పనితనంపై ప్రసంశల వర్షం కురిపించారు. ఇంజిన్‌లో మంటలు చెలరేగిన వీడియోని సౌదీ అటగాడు హతన్ బాహ్బిర్ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా "సేఫ్‌గా చేరుకున్నాం. అందరం క్షేమంగానే ఉన్నాం" అని కామెంట్ పెట్టాడు.
విమాన ఇంజిన్‌లో మంటలు వ్యాపించిన సమయంలో భయపడ్డారా? అని కొందరు ఆటగాళ్లను విలేకరులు ఈ వీడియోలో అడగడం మనం గమనించొచ్చు. అయితే, అందుకు వారు "అలాంటిది ఏమీ లేదు. అయితే, కాస్త భయపడ్డాం. దేవుడి థ్యాంక్స్ చెప్పాలి" అని అన్నారు.
సౌదీ అరేబియా పుట్‌బాల్ ఫెడరేషన్‌కు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ "విమానంలోని ప్రతి ఒక్కరూ క్షేమంగానే ఉన్నాం. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా క్షేమంగానే ఉన్నారు. టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగానే ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. రొస్తోవ్ ఆన్ డాన్ విమానాశ్రయం నుంచి హోటల్‌కు బయల్దేరాం" అని పేర్కొన్నారు.టోర్నీలో భాగంగా సౌదీ అరేబియా జట్టు బుధవారం ఉరుగ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ రొస్తోవ్ ఆన్ డాన్ నగరంలోని రొస్తోవ్ ఎరీనాలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకే సౌదీ అరేబియా జట్టు రొస్తోవ్ ఆన్ డాన్‌కు సౌదీ అరేబియా జట్టు బయల్దేరగా ఈ ప్రమాదం సంభవించింది.టోర్నీలో భాగంగా రష్యాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియా 5-0తో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







