ఎంటర్టైన్మెంట్ చీఫ్‌ని తొలగించిన సౌదీ అరేబియా
- June 19, 2018
సౌదీ అరేబియా, ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ అధికారిని తొలగిస్తూ డిక్రీ విడుదల చేసింది. 2016లో అహ్మద్ అల్ ఖాతిబ్ని జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా నియమించడం జరిగింది. దేశంలో ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్‌ని నిర్వహించేందుకు వీలుగా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది సౌదీ అరేబియా. నేషనల్ డే ఫెస్టివిటీస్ వంటివి కూడా ఈ విభాగం నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఖాతిబ్ని, సౌదీ అరేబియన్ మిలిటరీ ఇండస్ట్రీస్ (ఎస్ఎఎంఐ) ఛైర్మన్‌గానూ 2017లో నియమించారు. అలాంటిది ఖాతిబ్ని ఎందుకు తొలగించారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. గత ఏడాదే సౌదీ అరేబియా 35 ఏళ్ళుగా సినిమాలపై వున్న నిషేధాన్ని తొలగించిన సంగతి తెల్సిందే. 2030 నాటికి 300 థియేటర్లను ఓపెన్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో ఎంటర్టైన్మెంట్ చీఫ్‌ని తొలగించడం చర్చనీయాంశమయ్యింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..