గొంతులో ద్రాక్ష ఇరుక్కుని రెండేళ్ళ చిన్నారి మృతి

- June 19, 2018 , by Maagulf
గొంతులో ద్రాక్ష ఇరుక్కుని రెండేళ్ళ చిన్నారి మృతి

యు.ఏ.ఈ:రెండేళ్ళ చిన్నారి గొంతులో ప్రమాదవశాత్తూ ద్రాక్షపండు ఇరుక్కుపోవడంతో మృతి చెందిన ఘటన అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఈద్‌ తర్వాత మూడో రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. గొంతులో ద్రాక్షపండు ఇరుక్కుని, శ్వాస ఆడక చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఖోర్‌ఫక్కాన్‌ హాస్పిటల్‌ వైద్యులు ఈ ఘటనపై స్పందిస్తూ, చిన్నారిని తమ ఆసుపత్రికి తీసుకొచ్చారనీ, అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా వుందనీ, ఆ చిన్నారిని బ్రతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయనీ, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా వుండాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com