ప్లిప్‌కార్ట్‌లో భారీ సేల్.. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు.!
- June 19, 2018
ఎలక్ట్రానిక్ వస్తువులకు వేదిక అయిన ప్లిప్‌కార్ట్ నేటి నుంచి భారీ సేల్ ప్రారంభించింది. ఈ సేల్ జూన్ 24 వరకు కొనసాగుతుంది. సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 2, ఐఫోన్ 6, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్, మోటో ఎక్స్ 4 వంటి పాపులర్ మొబైల్ ఫోన్లను అందుబాటులో ఉంచింది. పిక్సెల్ 2 128 జీబీ మోడల్ అసలు ధర 70 వేల రూపాయలు ఉంటే సేల్‌లో 10,999కే ఇస్తుంది. ఈ ఆఫర్ పొందాలంటే ముందు రూ.199తో బైబ్యాక్ గ్యారెంటీ పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ప్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై 9,001 రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. అదే విధంగా క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్స్‌కి మరింత అదనంగా మరో 8వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. అంతే కాదు ఆరు నుంచి ఎనిమిది నెలలు వాడుకున్న తరువాత ఫోన్ వద్దనుకుంటే రూ.42 వేల ఎక్సేంజ్ వాల్యూ కూడా వినియోగ దారులు పొందొచ్చంటోంది. ఇలాంటివే మరికొన్ని ఫోన్లపై కూడా ఆఫర్లను అందిస్తోంది ప్లిప్‌కార్ట్.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్