షార్జా లో స్టోర్‌లోకి దూసుకెళ్ళిన కారు: మహిళ మృతి

- June 19, 2018 , by Maagulf
షార్జా లో స్టోర్‌లోకి దూసుకెళ్ళిన కారు: మహిళ మృతి

యు.ఏ.ఈ:షార్జాలోని ఓ షాప్‌లోకి కారు దూసుకెళ్ళిన ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. ఒరౌబా స్ట్రీట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ తాను నడుపుతున్న కారుపై కంట్రోల్‌ కోల్పోవడంతో, అతి వేగంతో కారు బ్యారియర్స్‌ని దాటుకుని, స్టోర్‌లోకి దూసుకెళ్ళిపోయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతిచెందిన మహిళను ఆఫ్రికా జాతీయురాలిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 19 ఏళ్ళ అరబ్‌ బాలిక, 35 ఏళ్ళ అరబ్‌ మహిళ గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని షార్జాలోని కాసిమి ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను అందించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com