ఆర్టిస్ట్‌కి దక్కిన గౌరవం.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
- June 19, 2018
సుప్రసిద్ధ కళాకారుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ అనారోగ్యంతో వరంగల్‌లోని ఆయన స్వగృహంలో కన్ను మూసారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చిన వేణు మాధవ్ ప్రముఖ రాజకీయ నాయకులందరికీ సుపరిచితమే. పదహారేళ్ల వయసులోనే మిమిక్రీ కళాకారుడిగా పరిచమైన వేణుమాధవ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్ వంటి అనేక భాషల్లో ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలు పొందారు. కళా రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంద్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఇగ్నో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో ఆయన్ను సత్కరించింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించుకున్నారు. ఆయన పుట్టిన రోజైన డిసెంబర్ 28న ప్రపంచ మిమిక్రీ కళాకారుల దినోత్సవంగా ఆయన శిష్యులు జరుపుతున్నారు. వేణుమాధవ్ పేరు మీద ఓ పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసి గౌరవించింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!