యు.ఏ.ఈ లో వీసా ఉల్లంఘనులకు క్షమాభిక్ష పెట్టే యోచన...

- June 19, 2018 , by Maagulf
యు.ఏ.ఈ లో వీసా ఉల్లంఘనులకు క్షమాభిక్ష పెట్టే యోచన...

అబుదాబీ:యూఏఈ రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలకు సంబంధించి విదేశీయులకు క్షమాభిక్ష ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిజన్‌షిప్‌ (ఎఫ్‌ఎఐసి) ఓ నిర్ణయం తీసుకుంటుందని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఎఫ్‌ఎఐసి ఛైర్మన్‌ అలి మొహమ్మద్‌ బిన్‌ హమ్మాద్‌ అల్‌ షామ్షి మాట్లాడుతూ, ఉల్లంఘనులు లీగల్‌ స్టాటస్‌ని సాధారణ పీజు చెల్లించి సరిదిద్దుకోవచ్చనీ, లేదంటే ఎలాంటి సమస్యలూ లేకుండా స్వచ్ఛందంగా దేశాన్ని వీడి పోవచ్చనీ అన్నారు. కొద్ది రోజుల్లోనే 'ప్రొటెక్ట్‌ యువర్‌సెల్ఫ్‌ వయా రెక్టిఫైయింగ్‌ యువర్‌ స్టేటస్‌' ప్రారంభమవుతుందని చెప్పారాయన. 2013లో మొత్తం 62,000 ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌ క్షమాభిక్ష పొందారు. రెండు నెలలపాటు ఈ క్షమాభిక్ష పీరియడ్‌ కొనసాగింది. ఇదిలా వుంటే, కువైట్‌ ప్రకటించిన జనరల్‌ అమ్నెస్టీలో 130,000 ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌కి ఊరట అందించిందని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ పేర్కొంది. అమ్నెస్టీ విషయంలో యూఏఈ పాలసీ చాలా ప్రత్యేకమైనదని అల్‌ షామ్షి చెప్పారు. అమ్నెస్టీని వినియోగించుకుని, తమ స్టేటస్‌ని సరిదిద్దుకోవడం, లేదంటే దేశం విడిచి వెళ్ళడం చేయాలనీ ఈ రెండూ చేయని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఫారినర్స్‌ ఎఫైర్స్‌ అండ్‌ పోర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ యాక్టింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ సయీద్‌ రెకాన్‌ అల్‌ రష్ది చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com