బహ్రెయినీ పౌరులకి ఉచితంగా 100 లీటర్ల పెట్రోల్‌?

- June 20, 2018 , by Maagulf
బహ్రెయినీ పౌరులకి ఉచితంగా 100 లీటర్ల పెట్రోల్‌?

బహ్రెయిన్‌లో పౌరులు నెలకు 100 లీటర్ల ఫ్యూయల్‌ ఉచితంగా పొందనున్నారట. ఈ మేరకు ఓ డ్రాఫ్ట్‌ ప్రపోజల్‌, ఫైనాన్షియల్‌ అండ్‌ ఎకనమిక్‌ కమిటీ ద్వారా హౌస్‌ ఆఫ్‌ రిప్రెఎంటేటివ్స్‌కి అందనుంది. కమిటీ ఈ డ్రాఫ్ట్‌ బిల్‌ని అప్రూవ్‌ చేసి, ప్రభుత్వానికి పంపనుంది. ఎంపీ నబీల్‌ అల్‌బ్లౌషి ఈ ప్రపోజల్‌ని సబ్‌మిట్‌ చేయబోతున్నారు. పెట్రోధరల పెంపు నుంచి ఉపశమనం కల్పించేదిశగా, వినియోగదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తక్కువ, మధ్య తరగతి ఆదాయం పొందుతున్న పౌరులే లక్ష్యంగా ఈ డ్రాఫ్ట్‌ బిల్లుని రూపొందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com