రస్ అల్ ఖైమాలోని ఓ ఇంట్లో పాము
- June 20, 2018
రస్ అల్ ఖైమాలోని జుల్పూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో పాము కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇంట్లోవారిని బయటకు పంపిన సివిల్ డిఫెన్స్ టీమ్, ఎట్టకేలకు పాముని గుర్తించి, దాన్ని చంపేయడం జరిగింది. కొండలు, ఎడారులకు దగ్గరగా వున్న ప్రాంతాల్లోనివారు అప్రమత్తంగా వుండాలని, ఇలాంటి ఘటనల గురించి తెలిస్తే వెంటనే సివిల్ డిఫెన్స్‌కి సమాచారం అందించాలని అధికారులు పేర్కొన్నారు. అయితే చంపబడ్డ పాము విషపూరితమా? కాదా? అన్నదానిపై స్పష్టత లేదు. యూఏఈలో స్కార్పియన్స్, స్నేక్స్, స్పైడర్స్ ఎక్కువగా కన్పిస్తాయి. రస్ అల్ ఖైమా మౌంటెయిన్స్‌లో ఓ వ్యక్తి మార్చి నెలలో పాముకాటుకి గురికాగా, వెంటనే అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. యూఏఈ సౌత్ ఈస్టర్న్ పార్ట్ ప్రాంతంలో మొత్తం ఏడు విషపూరితమైన ఆరెంజ్ అరేబియన్ క్యాట్ స్నేక్స్‌ని గుర్తించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..