స్మార్ట్ పార్కింగ్ ప్రాజెక్ట్‌ని ప్రారంభించిన దుబాయ్ పోలీస్
- June 22, 2018
దుబాయ్ పోలీస్, స్మార్ట్ మల్టీ లెవల్ పార్కింగ్ ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి ఈ ప్రాజెక్ట్ కోసం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మురాక్కాబాత్ పోలీస్‌స్టేషన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. యూఏఈలో ఇది తొలి ప్రాజెక్ట్ అని మేజర్ జనరల్ అల్ మర్రి చెప్పారు. 2016-21 స్ట్రాటజిక్ ప్లాన్‌లో భాగంగా దుబాయ్ పోలీస్ ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టిందని అన్నారు. రికార్డ్ టైమ్‌లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారాయన. ఈ ప్రాజెక్ట్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కార్ పార్కింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!