రజనీ కొత్త సినిమాకు స్టంట్స్ చేయనున్న పీటర్‌హెయిన్స్
- June 22, 2018
దక్షిణాదిలోని టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన పీటర్‌హెయిన్స్ మరో భారీ చిత్రానికి స్టంట్స్ కొరియోగ్రఫి చేయబోతున్నారు. కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రానికి పీటర్‌హెయిన్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. గతేడాది సంచలన విజయం సాధించిన 'పులిమురుగన్'లో అద్భుతమైన స్టంట్స్ కొరియోగ్రఫి చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. అందులో మోహన్‌లాల్ పులితో పోరాడే సన్నివేశాలను సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కించడంలో పీటర్‌హెయిన్స్ ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. అతనితో ఒప్పందం చేసుకోవడంతో రజనీకాంత్ కొత్త సినిమాలో యాక్షన్ దృశ్యాలు చాలా భారీగానే ఉండబోతున్నాయని చెప్పుకుం టున్నారు. ఇంతకుముందు రజనీ నటించిన 'ఎందిరన్', 'శివాజీ' చిత్రాలకు కూడా ఆయనే స్టంట్స్ అందించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!