దుబాయ్:మాస్టర్స్ కబడ్డీ టోర్నీ లో పాక్‌పై భారత్ ఘన విజయం
- June 22, 2018
దుబాయ్:టోర్నీ ఏదైనా సరే, ప్రత్యర్థి జట్టు ఎవరైనా ఆధిపత్యం మాత్రం మాదేనని అంటోంది భారత కబడ్డీ జట్టు.దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన కబడ్డీ మాస్టర్స్ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది.
ఈ టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్ 36-20 తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. అజయ్ ఠాకూర్ సారథ్యంలో భారత ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. ఈ పోరు ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత్... తొలి అర్ధభాగం ముగిసే సరికి 22-9తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.
అనంతరం ప్రారంభమైన రెండో అర్ధభాగంలో భారత ఆటగాళ్లు తమ జోరు కొనసాగించి మొత్తం మీద 36-20 పాయింట్ల తేడాతో పాకిస్థాన్‌పై టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం నమోదు చేసి తమ సత్తా చాటారు. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 15 రైడ్ పాయింట్లతో చెలరేగి ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు.
టోర్నీలో భాగంగా భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో శనివారం కెన్యాతో తలపడనుంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాక్, కెన్యాలతో కలిసి భారత్ గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్-బిలో ఇరాన్, కొరియా, అర్జెంటీనా ఉన్నాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







