రేపట్నుంచే: సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్
- June 23, 2018సౌదీ అరేబియా:రేపట్నుంచే (అంటే, ఆదివారం నుంచే) సౌదీ అరేబియాలో మహిళలు తమ వాహనాల్ని డ్రైవ్ చేయనున్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ఎంతోకాలంగా మహిళలపై అమల్లో వున్న డ్రైవింగ్ బ్యాన్‌ని ఎత్తివేయడంతో, రేపట్నుంచి మహిళలు సౌదీ అరేబియాలో డ్రైవింగ్ చేయడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రైవేటు డ్రైవర్లు, లేదంటే పురుషులైన బంధువుల సహకారంతోనే ఇన్నాళ్ళూ తమ అవసరాల కోసం కూడా మహిళలు ఆధారపడాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం వారికి లేదు. ఇది చాలా బిగ్ రిలఫ్ అని సీనియర్ అనలిస్ట్ నజాహ్ అల్ ఒతైబి చెప్పారు. ప్రో సౌదీ థింక్ ట్యాంక్ అరేబియా ఫౌండేషన్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారామె. సౌదీ మహిళలు, సెన్స్ ఆఫ్ జస్టీస్ని ఫీలవుతున్నారని ఆమె వివరించారు. ఇప్పటికే మహిళల డ్రైవింగ్‌కి సంబంధించిన లైసెన్సుల జారీ ప్రక్రియ చేపట్టారు. లైసెన్స్ పొందినవారు వాహనాల్ని నడిపేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ