ఈనెల 25న హైదరాబాద్‌లో పీసీసీ కార్యవర్గం సమావేశం..
- June 23, 2018
తెలంగాణలో అధికారం చేజిక్కుంచుకోవడంపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఏఐసీసీ సంస్ధాగత ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్, తెలంగాణ ఇంఛార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. నాలుగున్నర గంటలు సమావేశం సాగింది. కొత్తగా నియమించిన ముగ్గురు కార్యదర్శులకు 40 నియోజవర్గాలు కేటాయించారు. ఎన్నికల టైంలో అభ్యర్థుల ఎంపిక వంటి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. 90 రోజులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి జిల్లా, బ్లాక్, మండల స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఎలక్షన్లు జరిగే రాష్ట్రాలకే ఎన్నికల కమిటీలు నియమించారని.. తెలంగాణలో లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
పీసీసీ అధ్యక్షుడిని మార్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంచేసింది. పార్టీలోని కుమ్ములాటలు, దానం జంపింగ్పైన వార్‌రూమ్‌లో చర్చించారు. నాయకులు వెళ్తున్నా.. 10శాతం ఓటు బ్యాంక్ పెరిగిందని కుంతియా అన్నారు. డిసెంబర్లో ముందస్తు ఎన్నికలొచ్చినా కేడర్ని సిద్ధం చేయడమే కర్తవ్యమన్నారు. ఈనెల 25న హైదరాబాద్‌లో పీసీసీ కార్యవర్గం, జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ అమలు కానుంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







