పంచదార గవ్వలు..
- May 08, 2015
ఈరోజు ఒక మంచి స్నాక్ పరిచయం చేస్తున్నాం. చాల సులువుగా అవ్వటమే కాక చాల రోజులు నిలువ ఉండే స్నాక్..
కావలసిన పదార్ధాలు:
- మైదా - 1 కప్పు
- పంచదార - 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ
- నూనె - వేయించటానికి సరిపడా
- నెయ్యి - 2 స్పూన్లు
చేయు విధానం:
- ముందుగా 4 స్పూన్ల నూనెను బాగా వేడి చేసి మైదా లో వేసి కలపండి. ఇప్పుడు కొంచెం కొంచం నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి.
- ఈ ముద్దనుంచి చిన్నచిన్న ముక్కలు తీసుకొని గవ్వల చెక్కతో గానీ, ఏదైనా నొక్కులు ఉన్న డబ్బా మూతతో నొక్కి పెట్టుకోవాలి.
- ఈ ముక్కలను పేపర్ మీద ఒక 5 నిమిషాలు ఆరబెట్టి, నూనెలో బంగారు రంగు వచ్చే దాకా వేయించుకోండి.
- ఈలోపు స్టవ్ మీద పక్కన ఒక గిన్నెలో పంచదార వేసి అది మునిగేదాకా నీళ్ళు పోసి ముదురు పాకం వచ్చేదాకా మరిగించండి. అంటే పాకం నీళ్ళల్లో వేస్తే, చుక్కగా ఉండాలి అప్పుడు పాకం ముదురు అయిందని అర్ధం.
- ఈ పాకంలో నెయ్యి, వేయించిన గవ్వలు వేసి పాకం అన్నిటికి అంటేదాకా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పంచదార గవ్వలు రెడీ!!..
---- సి.లీల కుమారి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







