'దఢక్' మేకింగ్ మీడియో
- June 26, 2018
అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ దఢక్ అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ చిత్రం సైరత్‌కి రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఇషాన్ ఖట్టర్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. జూలై 20న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది . రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శశాంక్ కైతాన్ తెరకెక్కించగా, కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమాపై అభిమానులలో చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా, తాజాగా మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో జాన్వీ, ఇషాన్‌ల మధ్య జరిగిన ఫన్ సన్నివేశాలని చూపించారు. ఈ వీడియో అభిమానులని అలరిస్తుంది. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!